హైదరాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

Wed,June 13, 2018 12:02 PM

Two special trains between Hyderabad and Tirupati

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ - తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జూన్ 15న సాయంత్రం 7.40 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు(02764) బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు తిరుపతి చేరుకోనుంది. జూన్ 16న సాయంత్రం 7 గంటలకు తిరుపతి నుంచి ప్రత్యేక రైలు(02763) బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూర్, రేణిగుంట మీదుగా వెళ్లనున్నాయి.

2913
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS