సెల్ట్‌లో రెండు కోర్సులు ప్రారంభం

Wed,November 21, 2018 06:54 AM

Two new courses in CELT

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని సెంటర్ ఫర్ ఇంగ్లీ ష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో రెండు కోర్సుల తరగతులను ప్రారంభించినట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ జె. సావిత్రి తెలిపారు. ఎ టు మంత్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌గా పిలవబడే రెండు నెలల కోర్సు, ఎ వన్ మంత్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్‌గా పిలవబడే ఒక నెల కోర్సు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి కోర్సుకు రూ.4,000, రెండో కోర్సుకు రూ.1,500ను రుసుముగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ రెండు కోర్సులకు ఉ. ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, సా. ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. 9652856107, 7416575575 నెంబర్లలో సంప్రదించవచ్చు.

783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles