రవిప్రకాశ్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు

Wed,May 22, 2019 06:23 PM

tv9 former ceo ravi prakash anticipatory bail petition rejected by high court

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని రెండు సార్లు 160 సీఆర్‌పీసీ నోటీసులిచ్చినా రవిప్రకాశ్ స్పందించలేదని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. 160 సీఆర్‌పీసీ నోటీసులకు స్పందించకుంటే 41ఏ నోటీసులు ఇచ్చామన్నారు. వాట్సప్ కాల్‌లో రవిప్రకాశ్ అందరికీ అందుబాటులో ఉంటున్నా.. పోలీసుల విచారణకు హాజరుకావడం లేదన్నారు. అయితే.. రవిప్రకాశ్ తరుపు న్యాయవాది మాత్రం ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు.

1641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles