మేడారం జాతరకు 690 బస్సులు

Sun,January 21, 2018 08:02 AM

TSRTC Buses for Medaram Jatara

హైదరాబాద్: మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు వెళ్లే లక్షలాది మంది కోసం నగరం నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, జగద్గిరి గుట్ట, నేరేడ్‌మెట్, కేపీహెచ్‌బీ, లింగంపల్లి తదితర ప్రదేశాల నుంచి బయలుదేరి ఉప్పల్‌లోని వరంగల్ పాయింట్ మీదుగా మేడారం అమ్మవారి గద్దెల వరకు 690 బస్సులు నడుపనున్నారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 3వ తేదీవరకు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాలను ఎంజీబీఎస్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వీటిని ఆపరేట్ చేసేందుకు ప్రతీ పాయింట్‌లో డిపో మేనేజర్/ట్రాఫిక్ సూపర్‌వైజర్ స్థాయి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. జాతరను అత్యున్నత ప్రమాణాలతో, ప్రణాళికాబద్ధంగా నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జాతరకు వెళ్లే బస్సుల కోసం అనుభవమున్న, సుశిక్షుతులైన డ్రైవర్లను కేటాయిస్తున్నామని చెప్పారు.

ముందస్తు రిజర్వేషన్ చేసుకునేవారు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్లతో పాటు జంటనగరాలలోని ఏటీబీ ఏజెంట్ల వద్ద రిజర్వేషన్ సౌకర్యం పొందవచ్చని సూచించారు. అంతేకాకుండా ఈ-టికెట్‌ను www.tsrtconline.in ద్వారా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా మేడారం జాతర బస్సులకు సంబంధించిన వివరాలు, రూట్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. 27న 20 బస్సులు, 28న 40, 29న 50, 30న 100, 31న 120, ఫిబ్రవరి 1న 150, ఫిబ్రవరి 2న 160, 3న 50 బస్సులు నడిపిస్తామని వెల్లడించారు. ప్రయాణికులను జాతరకు తరలించి మళ్లీ తమ గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను తీసుకున్నామని అన్నారు.

1484
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles