ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ప్యాకల్టీలు

Thu,July 26, 2018 09:41 PM

TS Govt Junior Colleges Guest LecturersJLs Recruitment

హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు ప్రణాళికలు సిద్దం చేస్తోన్నారు. హైదరాబాద్ జిల్లాలో 25 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారుగా 128 ఉద్యోగాలు ఖాళీలున్నట్లు అధికారులు అంచనా వేస్తోన్నారు. కళాశాలల్లో అధ్యాపకులకు ఒత్తిడి భారం లేకుండా ఉండేందుకు అదనంగా గెస్ట్ ఫ్యాకల్టీని నియామించుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు అవకాశం కల్పించింది. గత విద్యా సంవత్సరంలో 115 మంది గెస్ట్ ఫ్యాకల్టీగా నియామించుకున్నట్లు ఇంటర్మీడియేట్ తెలిపారు. గతం సంవత్సరంతో పొలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరింగింది. గతం కంటే సుమారుగా 35శాతం అదనంగా విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు.

ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బోధనలో ఇబ్బందులు లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీలను నియామించుకోవాలని జిల్లా అధికారులు రాష్ట్ర ఇంటర్ బోర్డు అధికారులు గురువారం స్పష్టం చేశారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులకు అనుగుణంగా గెస్ట్ ఫ్యాకల్టీని నియామించాలని ప్రిన్సిఫల్స్‌కు ఆదేశించారు. కళాశాలల వారీగా వివరాలను జిల్లా అధికారికి సమర్పించిన తర్వాతే నియామకం చేపట్టాలని సూచించారు.

అయితే ఈనెల 27, 28 తేదీలల్లో విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం బోధిస్తున్న అధ్యాపకుల సంఖ్యతో పాటు అదనంగా అవసరమయ్యే అధ్యాపకుల జాబితాను రూపొందించాలని సూచించారు. ఈ జాబితా ప్రకారం ఏఏ కళాశాలల్లో ఏఏ సబ్జెక్టు అధ్యాపకులను తీసుకుంటారో తెలుస్తోంది. దీని ద్వారా ఆయా కళాశాలల ప్రిన్సిఫల్స్ పత్రిక ప్రకటనలతో ఖాళీలను గుర్తించి దరఖాస్తులకు ఆహ్వానించాలని సూచించారు. ఇంటర్మీడియేట్ బోర్డు రూపొందించిన నిబంధనల ప్రకారమే గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం ఉండాలని సూచించారు.

3648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles