కశ్మీర్‌ను సొంతం చేసుకునేందుకు పాక్ కుట్రలు!

Sun,February 17, 2019 02:13 PM

ts bjp leaders pays tribute to Pulwama martyrs

హైదరాబాద్: యుద్ధాల్లో ఓడిపోయినా పాకిస్థాన్‌కు బుద్ధిరాలేదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. జమ్ము కశ్మీర్‌ను సొంతం చేసుకునేందుకు పాక్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. పాక్‌లో ప్రజలకు ఉపాధి లేదు కానీ, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరాపార్కు వద్ద అమర జవాన్లకు ఇవాళ శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు నివాళులర్పించారు. దేశ సమైక్యతను దెబ్బతీయాలని పాకిస్థాన్ కొన్నేళ్లుగా యత్నిస్తోందని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. చైనా తప్ప అన్ని దేశాలు పాకిస్థాన్ చర్యను ఖండించాయని పేర్కొన్నారు.

3056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles