
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29వ తేదీని దీక్షా దివస్‌గా నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్వీ ప్రకటించింది. ఈ మేరకు టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆడెపు సుస్మిత్, ఓయూ టీఆర్ఎస్వీ ఇంచార్జి పెర్క శ్యాం పేర్కొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేటు వరకు 2కే రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం ఆరున్నర గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హాజరవుతారని పేర్కొన్నారు.