ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీ.. త్వరలో హైదరాబాద్‌కు: కేటీఆర్

Wed,May 22, 2019 09:41 PM

trs working president ktr attends odyssey logistics second anniversary in park hyatt

హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీని త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్క్ హయత్‌లో జరిగిన ఒడిస్సీ లాజిస్టిక్స్ రెండో వార్షికోత్సవం వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిరంజన్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రాష్ర్టానికి కొత్తగా 2800 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ తీసుకొచ్చామన్నారు. విస్తృతమైన రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ వల్ల 6 నెలలుగా అభివృద్ధి పనులన్నీ నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందితే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

3110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles