ఒంటరిగానే పోటీ చేస్తాం : కేసీఆర్

Thu,September 6, 2018 04:23 PM

TRS will contest alone in next elections says KCR

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని.. ఒంటరిగానే పోటీ చేస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఏర్పాటు చేసిన తొలి మీడియా సమావేశంలో 105 స్థానాలకు అభ్యర్థులను సీఎం ప్రకటించారు. 100కు పైగా స్థానాలు గెలుస్తాం. టీఆర్‌ఎస్ సెక్యూలర్ పార్టీ, సెక్యులర్‌గానే ఉంటం. త్యాగాలు ఎవరైనా చేశారంటే అది తామే. త్యాగాలు చేసిన టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెల్యూట్. 82 నియోజకవర్గాల్లో 60 శాతం పైనా ఓట్లు వస్తాయి. 100 స్థానాల్లో 50 శాతం పైనా ఓట్లు వస్తాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వందకు పైగా స్థానాలు గెలుస్తాం. ఏ రాష్ట్రంలోనైనా 20 ఎంపీ సీట్లు గెలుస్తమని కాంగ్రెస్ చెప్పగలదా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

రేపట్నుంచే ఎన్నికల కార్యాచరణ
రేపు శుక్రవారం మంచి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాం. ఇవి ముందస్తు ఎన్నికలు కావు. సాధారణ ఎన్నికలకు ఆరు నెలల గడువు ఉంది కాబట్టి.. ఎన్నికల జోన్‌లోనే ఉన్నాం. 50 రోజుల్లో 100 ఎన్నికల సభలు నిర్వహిస్తాం. 20 ఏండ్ల నుంచి కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ మంచికోసమే చేస్తారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేశాం. త్వరలోనే కే కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు ఏం చేసింది.. చేయబోయేది అన్నీ మేనిఫెస్టోలో చెబుతాం. టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని ప్రజలంతా చల్లగా బతకండి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

2708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS