105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

Thu,September 6, 2018 03:22 PM

TRS Party declares election Candidates by KCR

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దు అయిన మరుక్షణమే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ జాబితాను వెల్లడించారు. 105 నియోజకవర్గాలకు ఇవాళ పేర్లు ప్రకటిస్తున్నామన్న కేసీఆర్.. ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజవకర్గాలకు ఆయా లోకల్ లీడర్లతో మాట్లాడిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ ఐదు నియోజకవర్గాలకు మినహాయించి.. మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తున్నాం. అనేక సర్వేల తర్వాత టికెట్లు ఇచ్చాం. ఇద్దిరికి మాత్రమే టికెట్ నిరాకరించాం. చెన్నూర్, ఆందోళ్‌కు మాత్రం సిట్టింగ్‌లు కాదని కేసీఆర్ తెలిపారు.

7449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles