అనువణువునా నీలో తెలంగాణపై వ్యతిరేకత ఉన్నా.. జై తెలంగాణ అనిపించాం!

Mon,December 31, 2018 05:38 PM

TRS Leader Jagadish Reddy Fires On AP CM Chandrababu naidu

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆంధ్రా ప్రజలే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు బీజేపీ విషయంలో ఒకటే విధంగా వ్యవహరిస్తున్నాం. బీజేపీతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. హైకోర్టు విభజనపై చంద్రబాబు ప్రజలను మోసగించేలా మాట్లాడారు. చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబులా పూటకోమాట మాట్లాడే అలవాటు సీఎం కేసీఆర్‌కు లేదు. ఆనాడు తెలంగాణ కోసం కాంగ్రెస్, టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు.

అనువణువునా నీలో(చంద్రబాబు) తెలంగాణపై వ్యతిరేకత ఉన్నా.. నీతో కూడా జై తెలంగాణ అనిపించిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని వ్యాఖ్యానించారు. దేశంలోని 36 పార్టీలను ఒప్పించి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అడ్డదారుల్లో పోవడం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు అరుపులకు మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పారు. పరిపాలన అంటే ఎలా ఉండాలో నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు. హైకోర్టు విభజన తప్పదని తెలిసినా చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

3068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles