ప్రయివేటు పాఠశాలల్లో ఇక నుంచి ట్రైనీ ఉపాధ్యాయులు!

Sun,April 1, 2018 07:03 AM

Trainee Teachers only should teach in private schools in hyderabad

హైదరాబాద్: విద్యావ్యవస్థ నిబంధన ప్రకారం ప్రైయివేటు పాఠశాలల్లో విద్యను బోధించాలంటే ఉపాధ్యాయ శిక్షణ తప్పనిసరి. ప్రతి ప్రైయివేటు పాఠశాలను నడిపించాలంటే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జీవోలు చెబుతుంటాయి. కానీ రాష్ట్రంలోని ప్రయివేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.

కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సును ఏర్పాటు చేసింది. దేశంలోని ప్రైయివేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ లేకుండా విద్యాబోధనలు చేస్తున్న టీచర్లు ఈకోర్సు ద్వారా సర్టిఫికెట్లు పొందాలని సూచించింది. ఈ కోర్సును దేశంలోనే మొట్టమొదటి సారిగా నియమించనున్నామని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.

హైదరాబాద్ జిల్లాలో 2017 ఆగస్టు 27న 1534 మంది అభ్యర్థులు ఈ కోర్సు ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోర్సు 2 సంవత్సరాలు 4 విడుతలుగా పరీక్షలు జరగనున్నాయని అధికారులు వివరించారు. 2017 నుంచి 2019 సంవత్సరంలో ఈ శిక్షణ పూర్తి అవుతుంది. సంవత్సరానికి 15 రోజుల మాత్రమే శిక్షణ సమయం ఉంటుంది. శిక్షణతో పాటు పాఠ్యాంశ ప్రణాళిక, బోధన పద్ధతులపై వర్క్‌షాపును ఏర్పాటు చేస్తారు. ఇంటర్‌లో ఓసీకి 50శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45శాతం మార్కులుంటే ఈ కోర్సుకు అర్హులని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి 29 వరకు పరీక్షలు, వర్క్‌షాపు ఏప్రిల్ 16 నుంచి పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాదికారి బి.వెంకటనర్సమ్మ తెలిపారు. హైదరాబాద్ జిల్లా 18 సెంటర్లల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

2313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles