16న ఉపరాష్ర్టపతి రాక.. ట్రాఫిక్ ఆంక్షలు

Wed,August 15, 2018 07:18 AM

traffic restrictions on August 16 due vice president visit

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నగరంలో ఈ నెల 16, 17, 18వ తేదీలలో మూడు రోజుల పాటు పర్యటించనున్న సందర్భంగా ఆయన ప్రయాణించే రూట్లలో నిర్ణీత సమయాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయా రూట్‌లు, సమయాలలో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులకు గురికాకుండా, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు.

-16వ తేదీ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం వరకు మధ్యాహ్నం 12.20 నుంచి 1.10 గంటల వరకు.

-అదే రోజు సాయంత్రం 4.15 నిమిషాల నుంచి సాయంత్రం 5.05 నిమిషాల వరకు బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలిలోని ఓం కన్వెన్షన్ వరకు. సాయంత్రం 5.45 నుంచి 6.35 వరకు గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వరకు.

-17వ తేదీ ఉదయం 9.15 నుంచి 10.05 వరకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ హెచ్‌ఐసీసీ వరకు. ఉదయం 10.45 నుంచి 11.35 వరకు హెచ్‌ఐసీసీ నుంచి బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వరకు.

-సాయంత్రం 7.05 నుంచి 8 గంటల వరకు బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి ఓం కన్వెన్షన్ వరకు. అక్కడి కార్యక్రమం పూర్తయిన తరువాత ఓం కన్వెన్షన్ నుంచి బంజారాహిల్స్ వరకు.

-18వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 9.20 వరకు బంజారాహిల్స్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు.

2949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles