నేడు ఉప రాష్ర్టపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

Tue,October 2, 2018 07:14 AM

Traffic restrictions in hyderabad today

హైదరాబాద్ : నగరంలో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉపరాష్ట్రపతి వెంక య్యనాయుడు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, ఆయన పర్యటన నేపథ్యంలో, నిర్ణీత సమయాలలో ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

-2వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 3.20 గంటల వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బంజారాహిల్స్, రోడ్డు నెంబర్ 12లోని ఆయన నివాసం వరకు.
-3వ ఉదయం 8.45 నుంచి 9.35 వరకు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఖైరతాబాద్, విశ్వేశ్వరయ్య భవన్ వరకు, తిరిగి ఉదయం 10.15 గంటల నుంచి 11.05 వరకు ఖైతరాబాద్ నుంచి బంజారాహిల్స్, సాయంత్రం 4.15 నుంచి 5.05 నిమిషాల మధ్య బంజారాహిల్స్ నుంచి శిల్పకళావేదిక, సాయంత్రం 5.45 నుంచి 6.35 వరకు శిల్పా కళావేదిక నుంచి బంజారాహిల్స్ వరకు ఆంక్షలు ఉంటాయి.

-4వ తేదీ ఉదయం 9.20 నుంచి 10.05 వరకు బంజారాహిల్స్ నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీ వరకు, ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోఠి నుంచి బంజారాహిల్స్ వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
-7వ తేదీ ఉ 7.15 నిమిషాల నుంచి 8. 30 గంటల మధ్యలో బంజారాహిల్స్ నుంచి శంషాబాద్, ముంచింతల్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్ వరకు.

2243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles