అత్తాపూర్‌లో ఈరోజు రాత్రి నుంచి మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

Sat,January 12, 2019 06:33 AM

traffic restrictions in attapur due to musi high level bridge works

హైదరాబాద్: అత్తాపూర్‌లో మూసీ హైలెవల్ బ్రిడ్జి విస్తరణ పనుల నేపథ్యంలో 12వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ ఉదయం వరకు పిల్లర్ నంబర్ 110 నుంచి 117 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. రోడ్డు సగం మూసివేసి, భారీ వాహనాల రూట్ మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.

* రేతిబౌలి నుంచి అరంగర్ వైపు వెళ్లే భారీ వాహనాలు.. లారీలు, డీసీఎంలు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులను పిల్లర్ నంబర్ 100 వద్ద జియాగూడ, పురానపూల్, బహుదూర్‌పుర్ రూట్‌లో వెళ్లాలి.

* అరంగర్ చౌరస్తా నుంచి వచ్చే భారీ వాహనాలను పిల్లర్ నంబర్ 120 వద్ద అత్తాపూర్ న్యూబ్రిడ్జి, లంగర్‌హౌస్, నాలానగర్ వైపు మళ్లిస్తారు.

* ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలను అత్తాపూర్ బ్రిడ్జిపై నుంచి అనుమతిస్తారు.

1874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles