21న మహంకాళి బోనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు..

Sat,July 20, 2019 06:42 AM

traffic restrictions at secunderabad due Mahankali Bonalu

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఈనెల 21, 22వ తేదీల్లో ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 21వ తేదీ తెల్లవారుజాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయం సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాలు పార్కింగ్‌కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ట్రాఫిక్ ఆంక్షలు..
-21న ఉదయం 4గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు.
-పూజల సందర్భంగా మహంకాళి ఆలయం, టోబకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్‌లో ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపివేసి, రోడ్లను మూసివేస్తారు.
-సుభాష్ రోడ్, బాటా చౌరస్తా, రాంగోపాల్‌పేట మార్గాలను మూసివేస్తారు.
-ఆడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం మార్గాలను మూసివేస్తారు.
-జనరల్ బజార్ నుంచి ఆలయం మార్గం రోడ్డు మూసివేస్తారు.

దారి మళ్లింపు..
-కర్బాల మైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులను రాణిగంజ్ ఎక్స్ రోడ్డులో మినిస్టర్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు.
-ఆర్టీసీ బస్సులు రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేవి అల్ఫా ఎక్స్ రోడ్డు హోటల్, గాంధీ ఎక్స్‌రోడ్స్, ఓల్డ్‌మహంకాళి ట్రాఫిక్, బైబుల్ హౌస్, కర్బాల మైదాన్ రూట్‌లో వెళ్లాలి.
-తాడ్‌బన్ వెళ్లే బస్సులు క్లాక్‌టవర్, ప్యాట్నీ ఎక్స్‌రోడ్డు, వైఎంసీఏ, ఎస్‌బీహెచ్ ఎక్స్‌రోడ్స్ మీదుగా వెళ్లాలి. -బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఝాన్సీమండి ఎక్స్‌రోడ్డు నుంచి సజ్జన్‌నాల్ స్ట్రీ, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లిస్తారు.
-ఎస్‌బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్‌పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లిస్తారు.
-ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్‌బీహెచ్, క్లాక్ టవర్ వైపు మళ్లిస్తారు.
-క్లాక్‌టవర్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యాట్సీ ఎక్స్‌రోడ్డు నుంచి ఎస్‌బీహెచ్ ఎక్స్‌రోడ్డు, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు.
-సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీరోడ్డు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు వద్ద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైపు మళ్లిస్తారు.
-22న మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10గంటల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సెయింట్ మేరీ మార్గాలను మూసేస్తారు.
-సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్‌పల్లి, బాలానగర్, అమీర్‌పేట వెళ్లే ట్రాఫిక్‌ను క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, ఎస్‌బీహెచ్ వైపు నుంచి వెళ్లాలి.

ఉత్సవాలకు వచ్చే వాహనాల పార్కింగ్ ప్రదేశాలు
-సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్, ఉపకార్, ఎస్‌బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళాభవన్, మహబూబీయ కాలేజీలో పార్కు చేయాలి.
-కార్బాల మైదన్, బైబిల్ హౌస్, ఝాన్సీమండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హైస్కూల్ ప్రాంగణంలో పార్కు చేయాలి.
-రాణిగంజ్, అడవయ్య క్రాస్ రోడ్స్ వైపు వాహనాలు ప్రభుత్వ ఆడవయ్య మెమోరియల్ హైస్కూల్ ప్రాంగణంలో పార్కు చేయాలి.
-సుభాష్ రోడ్డు వైపు వాహనాలు ఓల్డ్ జిల్‌ఖానా ఓపెన్ ప్లేస్‌లో పార్కు చేయాలి.
-మంజు థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలను అంజలి థియేటర్ లైన్‌లో పార్కు చేయాలి.
-ఉత్సవాలకు వస్తున్న భక్తులు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కమిషనర్ కోరారు.

773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles