ఖైరతాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

Thu,September 13, 2018 07:30 AM

traffic restrictions at Khairatabad ganesh

హైదరాబాద్ : ఖైరతాబాద్ బడా గణేశ్ మండపం వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రతి రోజూ దర్శనం కోసం భక్తులు వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకుని గణపతి మండపం వైపు వచ్చే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు, వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు.

-మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ నుంచి వాహనాలను ఖైరతాబాద్ గణేశ్ మండపం వైపు అనుమతించరు. ప్రభుత్వ మింట్ కంపౌండ్ వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు.
-రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి వాహనాలకు ఈ మార్గంలో ఎంట్రీ లేదు. ఆ వాహనాలను సంత్‌నిరంకారీ వైపు మళ్ళిస్తారు.
-రాజ్‌దూత్ హోటల్, ఖైరతాబాద్ మార్కెట్ మార్గం నుంచి వచ్చే వాహనాలను మండపం వైపు అనుమతించరు. ఈ వాహనాలను ప్రింటింగ్ ప్రెస్, మార్కెట్ మార్గాల్లో మళ్లిస్తారు.
-ఈ మార్గంలో ఆంక్షలు 13వ తేదీ నుంచి 23 వరకు అమల్లో ఉంటాయని సీపీ అంజనీకుమార్ వివరించారు.

943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles