హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Mon,December 24, 2018 07:17 AM

traffic restriction in hyderabad city today

హైదరాబాద్‌ : శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారత రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ ఈ రోజు మధ్యాహ్నం హాకీంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి ప్రయాణమవుతారని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా బొల్లారంలోని హాకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశముందని, వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి, ఆ సమయంలో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు మధ్యాహ్నం 3.15 నిమిషాల సమయంలో జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కూడా ఆయన ప్రయాణించే రూట్లలో, నిర్ణీత సమయంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని, ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని సూచించారు.

1952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles