టౌన్‌ప్లానింగ్ ఫిర్యాదుల పరిష్కార దినం

Thu,February 21, 2019 06:51 AM

Town planning Complaints Settlement Day

హైదరాబాద్ : ఇంటి అనుమతులు పొందడంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఇక ప్రత్యేకంగా టౌన్‌ప్లానింగ్ ఫిర్యాదుల దినాన్ని నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. అంతేకాదు, టౌన్‌ప్లానింగ్ నిబంధనలపై దరఖాస్తుదారుల్లో అవగాహన కల్పించేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు, పలువురు ఇంటి అనుమతి దరఖాస్తుదారులతో బుధవారం కమిషనర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో నిబంధనల అమలు కఠినంగా ఉంటుందని, ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సులభంగా ఇంటి అనుమతులు పొందేందుకు అవసరమైన సహాయం కోసం ఆర్కిటెక్ట్‌లను నియమిస్తామన్నారు. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవడం ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని కోరారు. నగరంలో రోజుకు 7000 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, వాటికి సరిపడా పార్కింగ్ తప్పనిసరని కమిషనర్ స్పష్టం చేశారు.

465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles