వెయ్యగానే తీసేస్తున్నారు..!

Mon,September 9, 2019 08:31 AM

tonnes idol waste fished out from Hussainsagar

హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన వ్యర్థాల వెలికితీత పనులను హెచ్‌ఎండీఏ అధికారులు ముమ్మరం చేశారు. నిమజ్జన ఘట్టం సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పడిన చెత్త, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 400 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. ఎక్సావేటర్, ట్రాష్ కలెక్టర్, డ్రెజ్జింగ్ యుటిలిటీ క్రాప్టు (డీయూసీ) యంత్రాలు పూర్తిగా నీళ్లలోనే ఉండి సాగర్‌లో నిమజ్జనమైన విగ్రహాలు నీటి లోతుల్లోకి జారిపోకుండా క్షణాల్లోనే వెలికితీసి గట్టుకు చేర్చుతున్నారు. ఈ విగ్రహాలు, తాలూకూ అవశేషాలు, పూలు, పత్రి ఇతర వ్యర్థాలను తొలగించి లోయల్ ట్యాంక్‌బండ్ వద్ద నున్న జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డ్డ్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి జవహర్‌నగర్‌కు తరలిస్తున్నారు. ఈ వ్యర్థాల వెలికితీత సమయంలో ప్రజలు, వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వ్యర్థాల తొలగింపు పనులను సోమవారం నుంచి వేగవంతం చేస్తామని ఇంజినీర్లు పేర్కొన్నారు.

1939
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles