రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు

Fri,November 9, 2018 10:10 AM

today traffic restrictions in hyderabad for sadar festival celebration

హైదరాబాద్ : సదర్ ఉత్సవ్ మేళా సందర్భంగా నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ట్రాఫిక్ మళ్లింపులను విధించారు. ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గంలో ప్రయాణించాలని సీపీ అంజనీకుమార్ కోరారు. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 10వ తేదీ తెల్లవారు జాము 5 గంటల వరకు దారిమళ్లింపు అమల్లో ఉంటుందన్నారు.

మళ్లింపు ఇలా...
* కాచిగూడ క్రాసు రోడ్డు నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను టూరిస్టు హోట్ వద్ద మళ్లిస్తారు.
* విఠల్‌వాడి నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రాంకోఠి క్రాసు రోడ్డు వద్ద మళ్లిస్తారు.
* రాజ్‌మొహల్లా నుంచి వచ్చే వాహనాలు రాంకోఠి క్రాసు రోడ్డు సాబూ దుకాణం వైపు నుంచి వెళ్లాలి.
* రెడ్డి కాలేజీ నుంచి వచ్చే వాహనాలు బర్కత్‌పురా మీదుగా వెళ్లాలి.
* ఓల్డ్ బర్కత్‌పురా పోస్టాఫీసు నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలు క్రౌన్ కేఫ్ లేదా బాగ్‌లింగంపల్లి రూటులో ప్రయాణించాలి.
* పాత ఎైక్సెజ్ గల్లీ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలు బర్కత్‌పురా క్రాసు లేదా టూరిస్టు హోటల్ రోడ్డులో వెళ్లాలి.
* బర్కత్‌పురా చమన్ నుంచి వైఎంసీఏ రోడ్డులో వచ్చే వాహనాలు బర్కత్‌పురా క్రాసురోడ్డు లేదా టూరిస్టు హోటల్ రోడ్డు వైపు ప్రయాణించాలి.
* బ్రిలియంట్ గ్రామర్ స్కూల్(నారాయణగూడ ైఫ్లెఓవర్) నుంచి రెడ్డి కాలేజీ వైపు వెళ్లే వాహనాలు, నారాయణగూడ క్రాసు రోడ్డు మార్గంలో వెళ్లాలి.
ఈ మార్గాల్లో ప్రయాణించే నగర పౌరులు పోలీసులకు సహకరించాలని సీపీ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు.

1785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles