యాత్ర మార్గంలో భారీ బందోబస్తు..

Fri,April 19, 2019 11:00 AM

Tight security for Hanuman Shobha Yatra in hyderabad

హైదరాబాద్‌ : గౌలిగూడ రాంమందిర్‌ను నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఇవాళ ఉదయం సందర్శించి దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. మరికాసేపట్లో శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యాత్ర మార్గంలో దారి పొడవునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా యాత్ర మార్గాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. యాత్ర మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. 34 చోట్ల వాహనాల దారి మళ్లింపు ఉంటుందని సీపీ తెలిపారు. గౌలిగూడ రామాలయం నుంచి సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. సాయంత్రానికి తాడ్‌బండ్‌ వీరాంజనేయ ఆలయానికి శోభాయాత్ర చేరుకోనుంది. గౌలిగూడ, కోఠి, రాంకోఠి, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, సీటీవో జంక్షన్‌ మీదుగా తాడ్‌బండ్‌ చేరుకోనుంది శోభాయాత్ర.1997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles