మూడు ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలు సీజ్

Thu,October 10, 2019 08:33 PM

హైదరాబాద్: నిర్దేశిత ప్రమాణాలు పాటించని మూడు ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీలను అధికారులు సీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గల ప్లాస్టిక్ కవర్ల తయారీ కంపెనీల్లో గురువారం జీహెచ్‌ఎంసీ అధికారులు సోదాలు చేశారు. కాటేదాన్‌లో చేపట్టిన తనిఖీల్లో అధికారులు మూడు కంపెనీలను సీజ్ చేశారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కల ప్లాస్టిక్ కవర్లు తయారు చేస్తున్న కంపెనీలను అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా పలు దుకాణాలకు రూ.1.35 లక్షల చొప్పున జరిమానా విధించారు.

1524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles