రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Fri,November 9, 2018 09:51 AM

Three killed in road accident

మేడ్చల్: జిల్లాలోని పేట్‌బషీరాబాద్ పరిధిలోని దూలపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ద్విచక్రవాహనం కారును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సాగర్(23), రోహిత్(17), భూమేష్(14). మృతులు సురారం రాజీవ్ గృహకల్పకు చెందిన కూలీలుగా గుర్తించారు. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles