ప్లాస్టిక్ వేస్ట్‌తో ఇల్లు కట్టారు.. వీడియో

Fri,September 28, 2018 07:26 PM

This house at Miyapur is made out of recycled plastic

ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దేశవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ మీదే ప్రస్తుతం చర్చ. ఈ ప్లాస్టిక్ భూతం వల్ల పర్యావరణం పాడైపోతున్నదని మొత్తుకుంటున్నాం. కానీ.. ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ఉండలేకపోతున్నాం. ప్లాస్టిక్ వేస్ట్‌ను నాశనం చేయలేకపోతున్నాం. కానీ.. హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ఉన్న పార్కింగ్ షెల్టర్‌ను ప్లాస్టిక్ వేస్ట్‌తో నిర్మించారు. ఇసుక, ఇటుక, సిమెంట్ లాంటివి ఉపయోగించకుండా మొత్తం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తోనే దీన్ని నిర్మించడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ బాంబూ హౌస్ ఇండియా అనే కంపెనీ దీన్ని నిర్మించింది. దీన్ని నిర్మించడానికి 1500 కిలోల ప్లాస్టిక్ వేస్ట్‌ను ఉపయోగించారు.

ఇది పర్యావరణహితమైన ఇల్లు. రీసైకిల్ చేసిన పాల ప్యాకెట్లు, పెట్ బాటిల్స్, ప్లాస్టిక్ మూతలు ఉపయోగించి ఈ ఇల్లును నిర్మించినట్టు బాంబూ హౌస్ ఇండియా కంపెనీ కోఫౌండర్ ప్రశాంత్ లింగం తెలిపారు. 250 చదరపు అడుగుల్లో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంట్లో ఓ కిచెన్, బెడ్‌రూం, కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది చాలా చీప్, ఎండలోనూ కూల్‌గా ఉంటుందని ప్రశాంత్ అంటున్నారు. లక్షన్నరలో ఇంటిని నిర్మించడం పూర్తయిందన్నారు. ఇటువంటి ఇండ్లు నిర్మించుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ కూడా అవసరం ఉండదట. ఎందుకంటే వీటిని స్లాబ్ ఉండదు కదా. వీటిని వద్దనుకున్నప్పుడు ఎంతో సులువుగా కూల్చేయొచ్చు. కానీ.. ఓ ప్లాస్టిక్ హౌస్‌లో నివసించడం అనేది ఎంతవరకు సురక్షితం అని ప్రశాంత్‌ను అడిగితే ఏమంటారంటే.. ఈ ఇల్లు ఫైర్ ప్రూప్, వాటర్ ప్రూఫ్, ఏ పురుగులూ దీన్ని తొలచలేవు, చెదలు పట్టదు, వేడి నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉండ‌టానికి ఇంత కంటే ఇంకేం కావాలి.. క‌రెక్టే క‌దా..

6153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles