మా పనితీరుపై అనుమానాలుంటే.. సీబీఐ విచారణకు సిద్ధమే!

Fri,August 23, 2019 03:44 PM

Telangana Transco & Genco CMD Prabhakar Rao Speaks Over Power  purchase agreements

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అవగాహన లేక విద్యుత్‌ సంస్థలపై ఆరోపణలు చేశారని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు అన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని లక్ష్మణ్‌ చేసిన ఆరోపణలను ట్రాన్స్‌కో ప్రభాకర్‌ రావు ఖండించారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్‌ కొనుగోళ్లు, ఒప్పందాలపై ప్రభాకర్‌రావు వివరణ ఇచ్చారు. ''రాష్ట్రం ఏర్పడే నాటికి 71 మెగావాట్లు సోలార్‌పవర్‌ ఉండేది. ఇప్పుడు సోలార్‌పవర్‌ 3,600 మెగావాట్లకు పెరిగింది. ఎంతో పారదర్శకంగా విద్యుత్‌ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రూ.3.90పైసలకు విద్యుత్‌ను కొంటున్నాం. రూ.4.30 పైసలకు విద్యుత్‌ సరఫరా చేస్తామని ఎన్డీపీసీ ఎప్పుడూ చెప్పలేదు. 800 మెగావాట్ల ప్లాంట్‌ను దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సందర్శించారు. విద్యుత్‌ సంస్థలు పూర్తి స్వతంత్రమైనవి. మాపై ఎలాంటి ప్రలోభాలు ఒత్తిళ్లు లేవు. మేం ఎటువంటి ఒత్తిడులకు లొంగడం లేదు. రాత్రికి రాత్రే పీపీఏలు కుదుర్చుకున్నారనడం అవాస్తవం. విద్యుత్‌ ఉద్యోగుల పనితీరుపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. మా పనితీరుపై అనుమానాలుంటే సీబీఐ విచారణకు కూడా మేము సిద్ధమని ప్రభాకర్‌రావు'' పేర్కొన్నారు.

2420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles