పతంగులు ఎగురేద్దాం.. నోరూ తీపి చేసుకుందాం!

Sat,January 12, 2019 07:58 AM

telangana kite festival to be conducted from tomorrow in parade grounds

హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రంగురంగుల పతంగులు ఆకాశంలో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. నోరు తీపి చేసేందుకు స్వీట్లూ రెడీ అవుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ప్రభుత్వం కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ వేడుకల నిర్వహణకు పరేడ్ మైదానం ముస్తాబుతున్నది. ఇందుకోసం పర్యాటక, సాంస్కృతిక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. 30 దేశాల నుంచి 100 మంది కైట్ క్రీడాకారులు తరలిరానున్నారు. అందమైన పతంగులతో పరేడ్ గ్రౌండ్స్ హరివిల్లులా మారనున్నది. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 13న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు.

దీంతో పాటు తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో పాటు, హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , ఇతర దేశాలకు చెందిన మహిళలు తయారు చేసిన స్వీట్లు ఈ ఉత్సవంలో ప్రదర్శించనున్నారు. 13, 14, 15 తేదీల్లో కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. 1200 రకాల స్వీట్లను అందుబాటులో ఉంచుతామని, ఈసారి డయాబిటిక్ రోగులకు సంబంధించిన స్వీట్లు, పాలు లేకుండా తయారు చేసిన స్వీట్లను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ మూడు రోజుల్లో 10 లక్షల మంది పాల్గొంటారని, ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

1258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles