గవర్నర్, సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు

Tue,December 25, 2018 08:00 AM

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసు జననం ప్రజలకు సంతోషకరమైన సమయమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు ప్రేమ, సహనం ప్రంపంచానికి బోధించాడని కొనియాడారు. తాను క్రిస్టియన్ సహోదరులతో కలిసి ప్రపంచ శాంతి సామరస్యాల కోసం ప్రార్థిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు.

కరుణ, ఆనందంతో కూడిన ప్రేమను అందరికీ అందించాలన్న సందేశాన్ని మానవాళికి బోధించిన లార్డ్ జీసస్ పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా ఆనందంగా పండుగ జరుపుకొంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణతో మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles