రూ.1,46,492 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

Mon,September 9, 2019 11:56 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ''అతితక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రవృద్ధిరేటు 10.5గా నమోదైంది. ఐదేళ్లలో రాష్ట్రసంపద రెట్టింపయ్యింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు దక్కిన మూలధన వ్యయం వాటా తక్కువ ఉండేది. సమైక్య పాలన చివరి పదేళ్లలో రూ.54,052కోట్లుగా ఉంది. గడిచిన ఐదేళ్లలో మూలధనవయ్యం లక్ష 65,165కోట్లుగా ఉందని'' సీఎం పేర్కొన్నారు.


రూ.1,46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ.1,11,055కోట్లు
మూలధన వ్యయం రూ.17,274.67కోట్లు
బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08కోట్లు
రాష్ట్ర ఆర్థిక లోటు రూ.24,081.74కోట్లు

2541
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles