ముఖ్యమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణ పని జరుగుతోంది: రజత్

Wed,November 28, 2018 05:40 PM

Telangana Chief Electoral Officer rajath kumar press meet on telangana elections

హైదరాబాద్: డిసెంబర్ 7 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోసం కావాల్సిన ముఖ్యమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణ పని జరుగుతోందని ఆయన తెలియజేశారు. ఎన్నికల నిర్వహణలో పొరుగు రాష్ర్టాల నుంచి మంచి సహకారం లభిస్తోందన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 16 మించితే అదనపు ఈవీఎం అవసరం ఉంటుందన్న రజత్.. ఫోటోతో కూడిన ఓటర్ల జాబితా ముద్రణ కష్టమైన ప్రక్రియ అని ఈసందర్భంగా తెలియజేశారు.

1230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles