రాష్ట్ర అసెంబ్లీ రద్దు

Thu,September 6, 2018 02:14 PM

Telangana Assembly dissolved today

హైదరాబాద్ : తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దయింది. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ఏకవాక్య తీర్మానాన్ని సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టగా.. మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. కేబినెట్ ఆమోదించిన అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సమర్పించారు. ఈ తీర్మానాన్ని గవర్నర్ అమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగేందుకు కేసీఆర్ అంగీకరించారు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు జీవో నెం 134 విడుదలైంది. జూన్ 2, 2014న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 4 సంవత్సరాల 3 నెలల 4 రోజుల పాటు తెలంగాణ తొలి ప్రభుత్వం కొనసాగింది.

అసెంబ్లీ రద్దు కావడంతో.. రేపట్నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. హుస్నాబాద్ లో రేపటి ప్రజల ఆశీర్వాద సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం కోనాయపల్లిలో వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత హుస్నాబాద్ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అసెంబ్లీ రద్దుకు గల కారణాలు, మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి రేపటి సభలో కేసీఆర్ వివరించనున్నారు.


7631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles