తెలుగు రాష్ర్టాల్లో 23 నుంచి 'తానా' చైతన్య స్రవంతి

Sun,December 23, 2018 07:51 PM

Tana chaitanya sravanthi programs held in telugu states

హైదరాబాద్: అమెరికాలో నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు కమ్యూనిటీకి విస్తృతంగా సేవలందిస్తూ, మరోవైపు తెలుగు భాష, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి విస్తరణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన సొంత రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా అనేక కార్యక్రమాలకు చేస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి అమెరికాలో పెద్ద ఎత్తున తానా మహాసభలను నిర్వహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కళాకారులను, తెలుగు ప్రముఖులను ఈ మహా సభలకు ఆహ్వానించడం ద్వారా అమెరికాలో తెలుగు వైభవాన్ని మహాసభల ద్వారా తెలియజేస్తోంది.

వచ్చే సంవత్సరం జులై 4 నుంచి 6 వ తేదీ వరకు తానా 22వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో జరగనున్న సందర్భంగా తెలంగాణ, ఏపీల్లో చైతన్య స్రవంతి పేరుతో తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించేలా, మరుగునపడిన జానపదకళలను వెలుగులోకి తీసుకువచ్చేలా కార్యక్రమాలను చేయనుంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలను తెలుగు రాష్ర్టాల్లో నిర్వహిస్తున్నట్టు తానా అధ్యక్షుడు సతీశ్ వేమన తెలిపారు.

2236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles