రేపట్నుంచి సురభి నాటకాలు పునః ప్రారంభం

Sat,July 21, 2018 07:50 AM

తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి (సురభి) ఆధ్వర్యంలో పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు లలిత కళాతోరణం ప్రాంగణంలోని సురభి వేదికపై పౌరాణిక, చారిత్రాత్మక నాటకాల ప్రదర్శనలు ఈనెల 22 నుంచి పునఃప్రారంభవుతాయని పద్మశ్రీ అవార్డుగ్రహీత నాగేశ్వరరావు (బాబి)్జ ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల నుంచి ప్రతి శని, ఆదివారాల్లో కొనసాగించాల్సిన నాటకాల ప్రదర్శనలు నిలిచిపోయాయని, ఈ ఆదివారం నుంచి ప్రతివారం నాటకాల ప్రదర్శనలు తిరిగి కొనసాగుతాయని, ప్రవేశం ఉచితమని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నాటకాల ప్రదర్శనలు పునఃప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.

1088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles