సుహాసిని పోటీపై జూనియర్, కళ్యాణ్ రామ్ అసంతృప్తి

Fri,November 16, 2018 06:13 PM

Suhasini ticket from kukatpally confirmed by ap cm babu

హైదరాబాద్: మహా కూటమి తరుపున టీడీపీ నుంచి కూకట్‌పల్లి నియోజకవర్గంలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని నిలబెట్టనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె వైజాగ్‌లో ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలన్నింటికీ ఇవాళ ఫుల్‌స్టాప్ పడింది. నిజంగానే సుహాసినిని కూకట్‌పల్లి నుంచి టీటీడీపీ తరుపున బరిలో దింపుతున్నట్టు బాబు ఇవాళ ప్రకటించాడు. దీంతో సుహాసిని పోటీపై కుటుంబ సభ్యుల్లో అనిశ్చితి నెలకొన్నది. ఆమె పోటీకి సుహాసిని సోద‌రులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభ్యంతరం తెలుపుతున్నారు. మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా వద్దంటున్నట్టు సమాచారం. దీంతో ఆమె పోటీపై డైలమా నెలకొన్నది.

హరికృష్ణ భౌతికకాయాన్ని చంద్రబాబు... ఎన్టీఆర్ భవన్‌కు తీసుకెళ్లనీయలేదని కుటుంబ సభ్యులు ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయినప్పటికీ.. చంద్రబాబు హరికృష్ణకు సరైన గౌరవం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ మరణించారన్న వార్త తెలిసిన దగ్గర నుంచి.. అంత్యక్రియల వరకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నదని.. అధికారికంగా హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించి గౌరవించిందని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా వచ్చి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారని నందమూరి ఫ్యామిలీ చెబుతోంది. మరోవైపు.. తమకు మరో 20 ఏళ్ల సినిమా భవిష్యత్ ఉందని.. ఈసమయంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురెళ్లడం మంచిది కాదని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. నందమూరి ఫ్యామిలీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నందున సీఎం కేసీఆర్‌తో స్నేహమే మేలని హరికృష్ణ కుటుంబం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

10219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles