జూడో చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం

Sat,September 14, 2019 06:17 AM

sub junior National Judo Championship

అబిడ్స్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జూడో అసిసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్‌జిల్లా సబ్ జూనియర్ జూడో చాంపియన్‌షిప్ పోటీలను ఆదాయపన్ను శాఖ కమిషనర్ (విజిలెన్స్) రాకేష్‌కుమార్ పలివాల్, జూడో అసోసియేషన్ అధ్యక్షులు రాకేష్ జైస్వాల్‌లు ప్రారంభించారు.ఈ పోటీలను జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు జూడో అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్‌ల సం యుక్త ఆధ్వర్యంలో నిజాంపేట్‌లోని రిషి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనుండగా శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రాకేష్ పలివాల్ మాట్లాడు తూ క్రీడాకారులు తరచు పోటీలలో పాల్గొనడం వలన వారిలోని ప్రతిభ వెలికి తీయడం జరుగుతుందన్నారు. నగరంలోని ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని, జూడో క్రీడాకారులు కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జూడో అసోసియేషన్ అద్యక్షులు రాకేష్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని 19 జిల్లాల నుండి బాల, బాలికల జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు ప్రధానం చేయడంతో పాటు అక్టోబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మణిపూర్ ఇంపాల్‌లో జరిగే నేషనల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కె. కైలా ష్ యాదవ్,ఎంఎస్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.

270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles