‘లక్ష వీధికుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు’



Wed,September 13, 2017 05:56 PM
‘లక్ష వీధికుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు’

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష వీధికుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా. బి. జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మా ఇంటి నేస్తం కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీ వీధికుక్కుల దత్తత కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ, ట్రేడ్ లైసెన్స్‌ల జారీ, ఆస్తిపన్ను సేకరణ, స్వచ్ఛ ర్యాంకింగ్ వంటి పలు కార్యక్రమాలపై కమిషనర్ నేడు సమీక్ష చేపట్టారు. అదేవిధంగా స్వచ్ఛదూత్ యాప్ డౌన్‌లోడ్‌లను పెంచాలన్నారు. ఈ యాప్ ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసే గృహిణులకు జీహెచ్‌ఎంసీ రూ. లక్షను ప్రోత్సాహకంగా అందిస్తుంది.

662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS