ఉస్మానియా దవాఖానలో వెయిటింగ్ హాళ్ల ప్రారంభం

Tue,October 15, 2019 07:01 AM

హైదరాబాద్: ఉస్మానియా దవాఖానలో పలు విభాగాల్లో ఎమర్జెన్సీ ల్యాబ్, ఎంఎం 5 వెయిటింగ్ హాళ్లను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ సోమవారం ప్రారంభించారు. ఈమేరకు దవాఖానలోని కులీకుతుబ్‌షాహి భవనంలోని ఎమర్జెన్సీ ల్యాబ్, పాత భవనంలోని ఎంఎం 5 వెయిటింగ్ హాళ్లను దవాఖాన పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ రెండుంటిని ఏర్పాటు చేశామని చెప్పారు. కులీకుతుబ్‌షా భవనంలోని ఎమర్జెన్సీ ల్యాబ్‌లో 24గంటల అత్యవసర సేవలు రోగులకు మెరుగైన చికిత్సను అందజేయడానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. అంతేకాకుండా పాత భవనంలోని ఎంఎం 5 వద్ద వెయింటింగ్ హాల్ ప్రారంభోత్సవంతో రోగులకు వేచిఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. దవాఖాన అభివృద్ధికి సహకరించిన హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ సంస్థ డైరెక్టర్ ముస్తఫా హసన్ అస్కారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


పేదలకు ఉపయోగపడే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు పాలకవర్గం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పాథాలజీ విభాగాధిపతి త్రివేణిగోపాల్, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి రమాదేవి, మైక్రో బయాలజీ విభాగాధిపతి జ్యోతిలక్ష్మి, సీఎస్ ఆర్‌ఎంఓలు మహ్మద్ రఫీ, నరేందర్, కవిత, అనురాధ, సుష్మ, మాధురి, సిద్ధిఖి, శ్రీనివాస్, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ఇమ్రాన్ పాల్గొన్నారు.

327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles