ముగిసిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్

Fri,January 11, 2019 06:44 PM

sports and games meet ended today in goshamahal stadium

హైదరాబాద్: గోషామహల్‌లోని పోలీస్ స్టేడియంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగిసింది. మీట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. పలు విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి మహమూద్ అలీ ఈసందర్భంగా మెమొంటోలు అందజేశారు.

తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు పోలీసులకు క్రీడలు ఎంతో అవసరం. తెలంగాణలో హోంమంత్రిగా చేయడం సంతోషంగా ఉంది. నిజాం మ్యూజియం కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును వారం రోజుల్లో ఛేదించిన ఘనత హైదరాబాద్ పోలీసులది. క్రీడల్లో పాల్గొంటే ప్రతి ఒక్కరూ చురుకుగా ఉంటారు. ప్రజలందరూ క్రీడలను అలవాటు చేసుకోవాలి -హోంమంత్రి మహమూద్ అలీ

దేశం గర్వించదగ్గ రీతిలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ నిలిచింది. ఈ ఏడాది అనేక కీలక కేసులను ఛాలెంజ్‌గా తీసుకొని ఛేదించారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు అత్యుత్తమ పోలీసులుగా పేరు తెచ్చుకున్నారు. డ్యూటీలో మంచి ప్రాధాన్యత రావాలంటే క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి -సీపీ అంజనీ కుమార్

915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles