లడ్డూ అమ్మి సామాజిక సేవ

Sat,September 14, 2019 09:20 AM

spending the laddu auction amount for the   upliftment of less privileged members of society

బంజారాహిల్స్: గణేశ్ మండపాల్లో ఏర్పాటు చేసిన లడ్డూ పాటలకు గతంలో ఎన్న డూ లేనంతగా ఈసారి క్రేజీ ఏర్పడింది. లడ్డూ వేలంలో నిర్వాహకులు మార్కెటింగ్ మంత్రాలు జోడించారు. లడ్డూ వేలం అంటే బాలాపూర్ అనే పరిస్థితి మారింది. గ్రేటర్ పరిధిలోని అనేక మండపాల వద్ద లడ్డూ వేలం పాటలు జోరుగా సాగాయి. లక్షలాది రూపాయలను వెచ్చించి లడ్డూలను దక్కించుకునేందుకు ఔత్సాహికులు పోటీలు పడ్డారు. ఇదిలాఉండగా లడ్డూ వేలం పాటలను మరింత ఆసక్తికరం తా మార్చేందుకు కొంతమంది మండపాల నిర్వాహకులు వెరైటీ ఆలోచనలకు తెరతీశారు. లడ్డూ వేలం పాటను కొంతమందికే పరిమితం చేయకుండా ఎక్కువమందిని వేలంలో పాల్గొనేలా చేయడం కోసం కూపన్ల పద్ధ్దతిని ప్రారంభించారు. దీనిద్వారా మండపం వద్దకు వచ్చే భక్తులకు నిర్ణీత రుసుముతో కూపన్లను ఇచ్చి వాటిని నిమజ్జనం రోజు న లక్కీ డ్రా తీశారు. డ్రాలో గెలిచిన వారికి లడ్డూను అందజేశారు.

మరికొన్ని చోట్ల లక్కీ డ్రాలో గెలిచిన వారికి గణపతి లడ్డూతోపాటు బైక్‌లు కూడా బహుమతులు ఇచ్చారు. కొన్ని చోట్ల టీవీలు, మిక్సీలు డ్రాలో అందజేశారు. కొన్ని మండపాలవద్ద లడ్డూ వేలం పాటలో దక్కించుకున్న వారికి బంగారం పెడుతున్నారు. రూ.లక్షకు తులం బం గారం చొప్పున గతేడాది వేలంపాటలో లడ్డూను పొందిన వారికి బంగారం పెడుతున్నారు. దీంతో వేలంపాటలో వచ్చిన మొత్తం లో సుమారు 30శాతం వెనక్కి వచ్చినట్లే భావించి మరింత ఉత్సాహంగా వేలంపాటల్లో పాల్గొంటారని మండపాల నిర్వాహకులు భావిస్తున్నారు. మొత్తం మీద లడ్డూ వేలంపాటలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమం లో ఇలాంటి స్కీమ్‌ల ద్వారా గణపతికి ఆదాయాన్ని పెంచేందుకు ఇలాంటి స్కీమ్‌లు పెడుతున్నామని నిర్వాహకులు తెలిపారు.

లడ్డూ పాటల్లో మార్కెటింగ్ మంత్రం...

బంజారాహిల్స్ రోడ్ నెం-2లోని ఇందిరానగర్‌లో షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో జగదంబా స్వీట్స్ యజమాని నర్సింగ్ రూ.250 కూపన్‌తో లక్కీ డ్రాలో గెలుచుకున్నాడు. గతేడాది ఈ లడ్డూ రూ.40వేలు పలికింది.
కర్మన్‌ఘాట్‌లోని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో రూ.100కూపన్‌తో లడ్డూ వేలంలో పాల్గొని లక్కీ డ్రా లో లడ్డూతోపాటు యాక్టివా బైక్‌ను గెలుచుకునే అవకాశం కల్పించారు.
కర్మన్‌ఘాట్‌లోని మరో మండపంలో రూ.50 కూపన్‌తో లక్కీ డ్రా ద్వారా గణపతి లడ్డూతోపాటు మిక్సీ, లేదా వంట సామగ్రి గెలుచుకునే అవకాశం కల్పించారు.
అల్మాస్‌గూడలోని మల్లారెడ్డి కాలనీలో లడ్డూ వేలం పాటలో గెలిచిన వారికి లడ్డూతోపాటు తులం బంగారం
ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌లో లడ్డూను దక్కించుకున్నవారికి రూ.లక్షకు ఒక తులం బంగారాన్ని బహుమతి ఇస్తున్నారు.

సామాజిక సేవ కోసం లడ్డూ డబ్బులు..

నగరంలో గణపతి మండపాల్లో నిర్వహించే లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఆయా మండపాల ఖర్చులతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. రూ.లక్షల్లో పలుకుతున్న లడ్డూ డబ్బులతో మాధవ సేవతోపాటు మానవసేవ చేయాలని కొన్ని మండపాల నిర్వాహకులు భావిస్తుంటే మరికొన్ని మండపాల నిర్వాహకులు వచ్చిన డబ్బులతో తమ ప్రాంతంలోని దేవాలయాలను అభివృద్ధ్ది చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల అనాథ పిల్లల చదువు కోసం డబ్బును వినియోగించాలనుకుంటున్నారు. మరికొంతమంది వచ్చే ఏడాది ఉత్సవాలను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఈ డబ్బులను వినియోగిస్తామని చెబుతున్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో గణపతి మండపాలవద్ద లడ్డూవేలం పాటలు మరింత కొత్త పుంతలు తొక్కుతాయనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పవచ్చు.

నగరంలోనే అత్యంత ఎక్కువ ధరకు లడ్డూను దక్కించుకున్న బండ్లగూడ సన్‌సిటీ రిచ్‌మండ్ విల్లా గ్రూపు సభ్యులు రూ.18.51 లక్షలను చారిటబుల్ ట్రస్ట్‌ల ద్వారా అనాథ పిల్లల చదువు కోసం వినియోగిస్తామని ప్రకటించారు.
ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌లో గత రెండేళ్లుగా రికార్డు స్థాయిలో లడ్డూను స్థానిక బీజేపీ నేత దక్కించుకుంటున్నారు. ఈ మొత్తాన్ని స్థానికంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తున్నారు.

713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles