నాందేడ్, ఆదిలాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

Sat,November 17, 2018 06:12 AM

Special trains between Nanded and Adilabad

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆదివారం నాందేడ్-ఆదిలాబాద్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం రోజు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, ఇందులో సీట్లన్నీ అన్‌రిజర్వుడ్‌గా ఉంటాయని తెలిపింది. ఈనెల 18న మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి రైలు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు పందల్‌పూర్ నాందేడ్‌కు చేరుకుంటుంది. ఈ రైలు 19న ఉద యం 11.10 నిమిషాలకు నాందేడ్ నుంచి బయలుదేరి అర్ధరాత్రి 11.15కు ఆదిలాబాద్‌కు చేరుకోనుంది. ఈనెల 22న రాత్రి 7.25 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి తెల్లవారుజామున ఉదయం 8 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే 23న రాత్రి 10 గంటలకు ఆదిలా బాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు సాయం త్రం 4.30 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుందని పేర్కొంది. ప్రత్యేకరైళ్లు కుర్దువాడి,లాతూర్ రోడ్, పర్లి వైజయంత్, పర్బాని, పూర్ణ, ముడ్కెడ్, బోకార్, కిన్వట్‌ల మార్గాల మీదుగా నడుస్తాయని అధికారులు తెలిపారు.

1379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles