శాసనసభ ప్రత్యేక సమావేశాల నోటిఫికేషన్ జారీ

Fri,July 12, 2019 08:08 PM

Special session of Telangana Assembly to pass new Municipal Act

హైదరాబాద్: రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ఈ నెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన విష‌యం తెలిసిందే. తాజాగా శాసనసభ ప్ర‌త్యేక‌ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. జులై 18వ తేదీ ఉదయం 11 గంటలకు శాస‌న‌స‌భ స‌మావేశం ప్రారంభంకానుంది. జులై 19న మధ్యాహ్నం 2 గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభంకానుంది. ఉభ‌య స‌భ‌ల్లో నూత‌న మున్సిపల్ చట్టంపై చర్చించి ఆమోదం తెల‌ప‌నున్నారు.

ఈనెల 18న కొత్త మున్సిపాలిటీ చట్టం బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. బిల్లుపై 19న చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించినవని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉండవని సీఎం కార్యాలయం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఆగస్టు మొదటివారంలో పుర ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు. మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి ముసాయిదా చట్టాన్ని ఇప్పటికే న్యాయశాఖకు పంపించారు.

984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles