రేపటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్లు

Sun,October 7, 2018 11:07 AM

హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మెగామేళాను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 13 వరకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద నూతన కనెక్షన్లు తీసుకునేవారికి 3జీ స్మార్ట్ సిమ్‌కార్డుతోపాటు 351 ఎంబీల డాటాను ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ సీజీఎం వీ సుందరం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఫ్రాంచైజ్ రిటైల్ అవుట్‌లెట్లలో వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునని ఆయన సూచించారు. దీంతోపాటు ఈ నెల చివరినాటికి ప్రతిభ ప్లస్ ప్లాన్ కింద ఉచితంగా సిమ్‌కార్డులు నూతన కస్టమర్లకు ఇస్తున్నట్టు వెల్లడించారు.

3342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles