సహాయంగా తీసుకెళ్తే డబ్బులు కాజేశాడు

Wed,March 21, 2018 06:35 AM

Son in law theft cash from mother in law bank account

హైదరాబాద్: విశ్రాంత ఉద్యోగినికి చదువు రాదు.. పెన్షన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు అల్లుడిని బ్యాంకుకు తీసుకెళ్లేది.. అయితే దీన్ని ఆసరాగాచేసుకుని అల్లుడు ఆమె ఖాతానుంచి భారీగా డబ్బులు డ్రాచేసి కాజేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. బాలానగర్ హెచ్‌ఎల్ కాలనీలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో ఉద్యోగం చేసి రిటైరైన ఇస్లావత్ రుక్మీబాయి అనే వృద్ధురాలు భర్త 2016లో చనిపోవడంతో.. కుషాయిగూడలోని చిన్నకూతురు పల్లవి ఇంట్లో ఉంటున్నది. నెలనెలా బల్కంపేటలోని ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి పెన్షన్ డబ్బులను డ్రా చేస్తుంది. చదువు రాకపోవడంతో బ్యాంకుకు అల్లుడు కిష్టు నాయక్‌ను తీసుకెళ్లేది. ఇటీవల బ్యాంకు అకౌంట్లో డబ్బులను పరిశీలించగా సుమారు రూ. 35లక్షల దాకా తగ్గినట్లు తేలింది. తనకు తెలియకుండా వేలిముద్రలను తీసుకుని డబ్బులను కాజేసిన అల్లుడు కృష్టు నాయక్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

1556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles