అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్లు

Sun,January 20, 2019 07:58 AM

హైదరాబాద్: మాతాశిశు సంరక్షణ కోసం పాటుపడుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో స్మార్ట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. లబ్ధ్దిదారుల నమోదు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే లభ్యంకాబోతున్నాయి. ఇందుకోసంఅంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్లను అందజేస్తున్నారు. స్టార్ట్‌ఫోన్ల పంపిణీ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. శనివారం రోజున సికింద్రాబాద్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీచేయగా, మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ ఆర్గనైజర్ ముక్తవరం సుశీలారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీచేశారు. జిల్లాలో మొత్తం 914 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వాటిల్లో 868 మంది అంగన్‌వాడీ టీచర్లు పనిచేస్తుస్తుండగా, 46 ఖాళీలున్నాయి. అయతే జిల్లాకు 914 స్మార్ట్‌ఫోన్లు మంజూరుకాగా, పనిచేస్తున్న 868 మందికి స్మార్ట్‌ఫోన్లను అందజేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై ప్రస్తుతం జిల్లా నుంచి ఎంపికచేసిన నలుగురు అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణనిప్పించారు. శిక్షణ తీసుకున్న వీరు జిల్లాకు చేరుకుని, మిగిలిన అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణనిస్తున్నారు. ఫోన్ల పంపిణీ, శిక్షణ ముగియగానే మొత్తంగా అంగన్‌వాడీల్లో స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.


సీఏఎస్‌లో సమగ్ర సమచారం
జిల్లాలో గల అంగన్‌వాడీ కేంద్రా పనితీరు బాగానే ఉన్నా.. సమాచార సేకరణ, తీవ్ర పనిభారంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రిజిస్టర్ల నిర్వహణ, సమాచారాన్ని అందజేయడంతోనే వారికి సరిపోయేది. ఒక్కో అంగన్‌వాడీ పరిధిలో 11 రిజిస్టర్లను నిర్వహించాల్సి వచ్చేది. ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటుచేసి సమాచారం సేకరించాల్సి వచ్చేది. కానిప్పుడు అంగన్‌వాడీ టీచర్లకు ఇస్తున్న స్మార్ట్‌ఫోన్లల్లో కామన్ ఆప్లికేషన్ సిస్టం (సీఏఎస్)ను ఇన్‌స్టాల్ చేసి అందజేస్తున్నారు. దీనిలోనే 10 రిజిస్టర్లు, 8 మాడ్యుల్స్ ఉంటాయి. వీటిలో సమాచారాన్ని నిక్షిప్తం చేస్తే ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సర్వర్‌కు వెళ్లిపోతుంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని సేకరించడం, తప్పుడు సమాచారం లేకుండా, లోపాలు తలెత్తకుండా, పారదర్శకంగా ఉండేందుకు వీలుకలగనున్నది. ఇక పనిభారం తగ్గడం, రిపోర్ట్‌లను త్వరగా పంపించడానికి వీలుపడనుంది. ఫ్యామిలీ సర్వే, ఇమ్యునైజేషన్, గృహ సందర్శన, న్యూట్రిషన్ మానిటరింగ్, బాలామృతం, కోడిగుడ్లు, ఆరోగ్యలక్ష్మీ పథకం లబ్ధ్దిదారుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదుచేయడానికి ఆస్కారం ఏర్పడనున్నది.

3622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles