కూలిన పిట్టగోడ : ఒకరికి గాయాలు

Fri,April 19, 2019 10:56 AM

side wall collapse at Film Nagar

హైదరాబాద్‌ : నగరంలోని ఫిలింనగర్‌ వద్ద ఓ పిట్ట గోడ కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవన నిర్మాణానికి సైడ్‌ వాల్‌ కట్టారు. ఈ సైడ్‌ వాల్‌ కూలి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ గోడపై పడింది. దీంతో ఒక వ్యక్తికి గాయాలు అయ్యాయి. మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. శిథిలాలను తొలగిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవన యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.

480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles