షీ టీమ్స్ ఏర్పాటుతో కేసులు తగ్గాయి: స్వాతి లక్రా

Thu,October 26, 2017 12:43 PM

She Teams second anniversary celebrations held at rtc kalabhavan hyderabad

హైదరాబాద్: షీ టీమ్స్ ఏర్పాటుతో చాలా వరకు కేసులు తగ్గాయని షీటీమ్స్ ఇన్‌చార్జ్ స్వాతి లక్రా అన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో షీటీమ్స్ 3వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, స్వాతి లక్రా, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరయ్యారు. ఈ సందర్భంగా షీటీమ్ ఈ-లర్నింగ్, షీటీమ్స్ ఫర్ మి వెబ్‌సైట్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన స్వాతి...నేరాలను అదుపు చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నేర రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

1576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles