యువతులను వేధించిన 31 మంది పోకిరీలు అరెస్ట్

Mon,October 8, 2018 08:20 AM

she team arrested 31 people harassing women case

హైదరాబాద్ : బాలికలు, యువతులను వేధిస్తున్న పోకిరీలపై మూడు వారాల్లో రాచకొండ షీ టీమ్స్ 28 కేసులను నమోదు చేసింది. ఇందులో 16 ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు, 12 పెట్టీ కేసులను నమోదు చేసి, మొత్తం 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న వీరందరికి కుటుంబ సభ్యుల సమక్షంలో భూమిక సంస్థకు చెందిన మానసిక నిపుణులతో రాచకొండ షీ టీమ్స్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లు యువతుల వెంట పడి ప్రేమ పేరుతో వేధించారు. ప్రేమను అంగీకరించకపోతే ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని బంధువులు, స్నేహితులు, సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రతిష్టకు భంగం కలిగిస్తామని బెదిరించారు. దీంతో బాధితులు ఫీ టీమ్స్‌కు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్ హాట్‌స్పాట్స్‌లో నిఘాపెట్టి పలువురు పోకిరీలను ప్రత్యక్షంగా పట్టుకుని వారి చేష్టలను వీడియో రికార్డింగ్ చేశారు. సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్ గణేశ్ నిమజ్జనం సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులను కూడా అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

2362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles