భార్యాబిడ్డలను అమ్మేసిన భర్త, అత్తామామ

Mon,May 20, 2019 07:32 AM

sell wife and childrens by husband and mother in laws

హైదరాబాద్ : అంగట్లో పండ్లను అమ్మినట్లు భార్య, బిడ్డలను అమ్మిన ఓ భర్త నిజస్వరూపం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బండ్లగూడ నూరీనగర్‌కు చెందిన ఫజల్ రహమా రహమాని(25), ఇష్రత్ ఫర్వీన్ (22)లకు 2016లో పెద్దల సమక్షలో వివాహం జరిగింది. ఏడాది తిరిగేలోపు ఫర్వీన్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని అత్తా మామలతో కలిసి భర్త ఫజల్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. రెండో సారి కూడా ఫర్వీన్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

కాగా షాద్‌నగర్‌లో బంధువుల ఇంట్లో పెండ్లి ఉందని నమ్మబలికి భర్త, అత్తామామ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. పిల్లలతో కలిసి ఇంట్లో ఫర్వీన్ ఒంటరిగా ఉంటుంది. రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నిన్ను.. నీ పిల్లలను మీ అత్తింటివారు మాకు రూ.3లక్షలకు అమ్మేశారని, ఇల్లు కూడా మేమే కొన్నామని పేర్కొంటూ వారిని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. చుట్టూపక్కల వారు దుండగులను పట్టుకొని 100 నంబర్‌కు డయల్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని పోలీసులు విడిచిపెట్టారని బాధిత మహిళకు అండగా నిలిచిన సంఘ సేవకురాలు జయ విధ్యాల ఆరోపించారు.

5881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles