డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న సెక్యూరిటీ గార్డుల తొలగింపు

Mon,October 29, 2018 07:10 AM

security guards in gandhi hospital fired after demanding money from patients

హైదరాబాద్: రోగులు, వారి బంధువుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు సెక్యూరిటీ గార్డులను గాంధీ దవాఖాన అధికారుల ఆదేశాల మేరకు ఏజిల్ సంస్థ నిర్వాహకులు వారిని తొలగించారు. అయితే వీటిపై ఫిర్యాదులు ఎక్కువవుతున్న క్రమంలో అధికారులు సంస్థ నిర్వాహకులను తీవ్రంగా మందలించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సంస్థ నిర్వాహకులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తొలగించారు. అంతే కాకుండా సీసీ పుటేజీల ఆధారంగా ఎవరెవరు ఎక్కడ డబ్బులను వసూళ్లు చేస్తున్నారో గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అయితే ఇక నుండి అన్ని విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందిపై, సెక్యూరిటీపై మరింత నిఘాను పెంచి ఇలాంటి సంఘటనలకు ఒడిగడుతున్నారో గుర్తించి వారిని నిర్ధాక్షిణంగా తొలగించడం జర్గుతుందని సిబ్బంది, సెక్యూరిటీగార్డులు జాగ్రత్తగా ఉండాలని సంస్థ నిర్వాహకులు సూచించారు. ఇందులో ఇతరులెవ్వరు జోక్యం చేసుకోరాదని కేవలం రోగులను, వారి బంధువులను దృష్టిలో ఉంచుకుని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు.

2841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS