హైదరాబాద్‌లో ఆకస్మిక వర్షాలు ఎందుకంటే ?

Thu,October 12, 2017 06:58 PM

Scientists give reasons for extreme rain events in Hyderabad

హైదరాబాద్: మధ్యాహ్నాం వరకు ఫుల్ ఎండ. ఆ తర్వాత అకస్మాత్తుగా దట్టమైన మేఘాలు. సాయంత్రం ఇక తట్టుకోలేని వాన. ఇదో విచిత్రమైన వాతావరణం. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇదొక్క మన రాష్ట్రమే కాదు.. సెంట్రల్ ఇండియాలో మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది. వాతావరణంలో కలుగుతున్న పెను మార్పులే..ఈ సడెన్ రెయిన్‌కు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 1950 నుంచి 2015 వరకు తెలంగాణ ప్రాంతంలో వాతావరణ పరిస్థితి మూడింతలు మారినట్లు తెలుస్తున్నది. అరేబియా సముద్రం మీదుగా వస్తున్న తేమ వల్ల ఈ విపరీత వాతావరణ పరిస్థితికి కారణమని పరిశోధకులు అంచనా వేశారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య.. అరేబియా సముద్రం నుంచి వేసవిలో వచ్చే రుతుపవనాల వల్ల.. చాలా ప్రాంతాల్లో వాతావరణం మారినట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. దీని వల్లే మధ్య భారత దేశంలో అక్కడక్కడ వర్షాలు భయపెట్టిస్తున్నాయట.

అరేబియన్ సముద్ర తేమను పెనుగాలులు మోసుకెళ్లుతున్న తీరు వల్ల చాలా ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఒడిశా, అస్సాంలోని కొన్ని భాగాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పుణెకు చెందిన సెంటర్ ఫర్ ైక్లెమెట్ ఛేంజ్ రీసర్చ్, ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ సంస్థలు ఈ అంచనా వేశాయి. శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్.. వాతావరణ మార్పులపై నివేదికను వెల్లడించారు. అక్టోబర్ నెలలో.. ఈ వాతావరణం వల్ల వర్షాలు పడే ఛాన్సు ఉందని ఆయన వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్‌తో పాటు నగరాల్లో భూములను వాడుతున్న తీరు వల్ల కూడా వర్ష బీభత్సం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు అంతటా పెరుతున్నాయి. దీంతో ఎక్కువ సమయం.. వాతావరణంలో తేమ ఉండే అవకాశం ఉంది. ఆకాశంలో తేమ ఎక్కువగా ఉంటే. వర్షాలు కూడా అంతే భారీ స్థాయిలో పడే అవకాశాలున్నాయని, ఇక కాంక్రీట్ రోడ్ల వల్ల నగరాల్లో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రాక్సీ తెలిపారు.

17657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles